రెండు గజాల దూరం పాటిస్తే అదే మనకు శ్రీరామ రక్ష

దేశంలో అమలు అవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని వేల ప్రాణాలను మనం కాపాడుకోగలిగాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

ఆయన నేడు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టం ఏమీ లేదు.

మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది.ఎలాంటి దిగులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బౌతిక దూరంను పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని ప్రధాని విజ్ఞప్తి చేశాడు.

దో గజ్‌ దూర్‌ శ్రీరామ రక్ష అంటూ మోదీ అభిప్రాయ పడ్డారు. ప్రజల్లో ఉన్న లాక్‌ డౌన్‌ మూడ్‌ను అలాగే కొనసాగిస్తూ సొంత వాహనాలు ఉన్న వారిని రోడ్లపై తిరిగేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు.

ప్రపంచ వ్యాప్తంగా కూడా మన లాక్‌డౌన్‌ విధానంను అమలు చేస్తున్నారు.ప్రజలు రోడ్లపైకి రాకుండా మనం తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయం.

Advertisement

ప్రస్తుతం మనం రెడ్‌ జోన్‌లను ఆరెంజ్‌ జోన్‌లుగా, ఆరెంజ్‌ జోన్‌లను గ్రీన్‌ జోన్‌లుగా మార్చేందుకు మనం సిద్దం అవ్వాలంటూ ఈ సందర్బంగా మోడీ పిలుపునిచ్చారు.లాక్‌డౌన్‌ కొనసాగింపుపై చర్చించే అవకాశం ఉందనుకున్నారు.

కాని ఆ విషయమై మరోసారి సీఎంలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు