కరోనా మహమ్మారి విలయతాండవంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో కోవిడ్ 19 బాధితుల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తమ ప్రాణాలను కాపాడుతున్నారు.
ఇంతలా సేవలు చేస్తున్న వారికి ప్రపంచం జేజేలు పలుకుతోంది.ఇప్పటికే పలు దేశాల ప్రజలు వైద్యులకు సంఘీభావంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.
తాజాగా అమెరికాలో భారతీయ వైద్యురాలికి అక్కడి స్థానికులు సెల్యూట్ చేశారు.కరోనా బాధితులకు సేవలు చేస్తూ ఆసుపత్రులకే పరిమితమవుతున్న వైద్యులు… తమ కుటుంబాలకు దూరం అవుతున్నారు.రోజుల తరబడి కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్న అక్కడి వైద్యులకు ప్రజలు, ప్రభుత్వ అధికారులు గౌరవ మర్యాదలు చేస్తున్నారు.ఈ క్రమంలో సౌత్ విన్సడర్ ఆసుపత్రిలో భారతదేశానికి చెందిన వైద్యురాలు ఉమా మధుసూదన్ పనిచేస్తున్నారు.
కరోనా రోగులకు ఈమె చేస్తున్న సేవలకు గాను అధికారులు, స్థానికులు ఉమా ఇంటిముందు ప్రభుత్వ వాహనాలతో పరేడ్ నిర్వహించారు.వాహనాలలోంచి ఫ్లకార్డులు పట్టుకుని, చప్పట్లు కొడుతూ ఆమెను గౌరవించారు.ఉమా మధుసూదన్ కూడా వారిని ఉత్సాహపరుస్తూ నమస్కారం చేశారు. కర్ణాటకలోని మైసూరు ఆమె స్వస్థలం.అమెరికాలో జరిగిన ఈ పరేడ్‌కు సంబంధించిన వీడియోను కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.దీనికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆమెను అభినందిస్తూ పలువురు లైకులు, షేర్లు చేశారు.
కాగా కోవిడ్ 19 కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 42,518 మంది ప్రాణాలు కోల్పోగా.7,92,938 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.దీంతో అగ్రరాజ్యం దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటోంది.
దేశంలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి.