మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.షార్ట్ ఫిలింస్ నుండి వెండితెరపై హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారికా, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఇక హీరోయిన్గా ఫెయిల్ అయిన నిహారిక ఇప్పుడు కొన్ని స్క్రిప్టులను వింటున్నట్లు తెలుస్తోంది.
కాగా మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీ, ఈసారి అందాల ఆరబోతను ఎరగా విసరనుందట.
దీనికోసం హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ.ఇప్పటి వరకు చేయని విధంగా గ్లామర్ డోస్‌ను పెంచేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇదే విషయంపై ఆమె మాట్లాడింది.త్వరలోనే అందాల ఆరబోతతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపింది.
ఇక తన పెళ్లి తరువాత సినిమాలు చేయగలనో లేదో ఇప్పుడే చెప్పలేనని మెగా డాటర్ తెలిపింది.సమంత లాగా ఆమె వివాహం చేసుకున్నాక సినిమాల్లో నటించేది లేనిది కాలం వచ్చినప్పుడే తెలుస్తుందని ఆమె వెల్లడించింది.
మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి అందాల ఆరబోతకు నిహారికా రెడీ అవుతుందని చెప్పాలి.