అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంటి పని చేస్తూ బి ద రియల్‌మన్ అనే ఛాలెంజ్‌ను రాజమౌళికి చేయడం జరిగింది.ఆ ఛాలెంజ్‌ను వెంటనే స్వీకరించిన దర్శకుడు రాజమౌళి తాను ఇంటి పని చేస్తూ ఉన్న వీడియోను పోస్ట్ చేసి ఎన్టీఆర్ ఇంకా చరణ్‌లను ఛాలెంజ్ చేశారు.
జక్కన్న ఛాలెంజ్‌ను ఆర్‌ఆర్‌ఆర్ స్టార్స్ స్వీకరించారు.ఎన్టీఆర్ మొదట పని చేసి చిరంజీవి నాగార్జునలను ఛాలెంజ్ చేశారు.
ఇక కాస్త లేట్ గా అయినా రామ్ చరణ్ కూడా జక్కన్న సవాల్‌ను స్వీకరించాడు.
ఇల్లు తూడ్చి, చెట్లకు నీళ్లు పోసి, కాఫీ పెట్టి ఉపాసనకు ఇచ్చిన వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ ఛాలెంజ్‌లో చరణ్ మరో నలుగురిని భాగస్వామ్యులు కావాలంటూ పిలుపునిచ్చాడు.మొదటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఛాలెంజ్ చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మరియు తెలుగు హీరోలు రానా దగ్గుబాటి ఇంకా శర్వానంద్‌లను రామ్ చరణ్ నామినేట్ చేశారు.
చరణ్ ఈ ఛాలెంజ్ చేయడంతో బాలీవుడ్‌కు కూడా ఇది పాకబోతుంది.రణ్‌వీర్ సింగ్ ద్వారా ఇది బాలీవుడ్ లో మరింత పాపులర్ అవ్వొచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండే త్రివిక్రమ్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించనున్నాడా లేదా అనేది చూడాలి.రానా ఇంకా శర్వానంద్‌లు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్‌లను యాక్సెప్ట్ చేస్తారని తెలుస్తోంది.
మొత్తానికి స్టార్స్ అయినా మేము సాదారణ మనుషుల మాదిరిగానే ఇల్లు తూడుస్తాము ఇంటి పని చేస్తామని ఈ ఛాలెంజ్ ద్వారా నిరూపించుకుంటున్నారు.