కొత్తగా మరో 35, ఏపీ లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరుగుతున్నాయి.నిన్న ఒక్కరోజే 75 కేసులు నమోదు కాగా,ఈ రోజు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో కొత్తగా మరో 35 కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.

 35 New More Cases Diagnosed In Andhra Pradesh Corona Virus, Ap, Kurnool, Guntu-TeluguStop.com

ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు తేలినట్లు ప్రభుత్వం ప్రకటించింది.దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 757 కు చేరినట్లు తెలుస్తుంది.

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కర్నూల్ లో 10 కేసులు నమోదు కాగా,గుంటూరు లో 9,కడపలో 6,పశ్చిమ గోదావరి లో 4,అనంతపురం,కృష్ణా జిల్లాల్లో మూడు చొప్పున కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కర్నూల్ లో అత్యధికంగా 184 కేసులు నమోదు అవ్వడం తో మొదటి స్థానంలో ఉండగా, 158 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 757 కేసులు నమోదు కాగా 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ లో మొత్తంగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందగా,639 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.రోజు రోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వ తేదీవరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube