వైరల్‌ : అక్కడ ప్రజలు వీధుల్లోకి రాకుండా దెయ్యాలను వదిలారు, వాట్‌ ఏ ఐడియా సర్‌ జీ

కరోనా విపత్తును ప్రభుత్వాలు ఊహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కూడా వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్ష మందికి పైగా మృతి చెందటంతో పాటు రెండు మిలియన్‌ల మంది కరోనా బారిన పడ్డారు.

 Indonesian Uses Ghosts For Distancing People Because Of Corona Virus, Corona Vir-TeluguStop.com

ఆ దేశం ఈదేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలను కూడా ఈ మహమ్మారి వణికిస్తూనే ఉంది.దాదాపుగా 50కి పైగా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.

కాని కొన్ని దేశాల్లో మాత్రం అస్సలు లాక్‌డౌన్‌ నియమాలను పట్టించుకోవడం లేదు.

తాజాగా ఇండోనేషియాలో రాత్రి సమయంలో ప్రజలు తిరుగుతున్నారనే విషయం తెలిసి స్థానిక అధికారులు రోడ్లపై దెయ్యాలను ఉంచారు.

రోడ్ల మీద అక్కడక్కడ అస్థిపంజరాలు కూడా వేయడంతో స్థానికులు రాత్రి సమయంలోనే కాదు కనీసం డే టైంలో కూడా బయటకు వచ్చేందుకు భయపడుతునన్నారు.ఇండోనేషియాలో మూడ నమ్మకాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.

దేశ వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఆత్మలు దెయ్యాలను నమ్ముతారు.అందుకే వారికి తగిన బుద్ది చెప్పేందుకు వారి మూడ నమ్మకాలనే ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.

Telugu Corona, Indialock, Lock-General-Telugu

తెల్లటి డ్రస్‌లు వేసి కొందరిని రాత్రి సమయంలో రోడ్ల మీద కూర్చోబెట్టడంతో అధికారులు ప్రజల్లో భయంను కలిగిస్తున్నారు.అక్కడ లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తున్నారు.కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అస్సలు ఛాన్స్‌ తీసుకోవడం లేదు.అశ్రద్ద చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అమెరికాను చూస్తుంటే అర్థం అవుతుంది.

Telugu Corona, Indialock, Lock-General-Telugu

అందుకే ఏమాత్రం ఛాన్స్‌ తీసుకోకుండా ఇలా దెయ్యాల పేరుతో ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నామంటూ స్థానిక అధికారులు మీడియాతో చెబుతున్నారు.ప్రజలు కూడా తమ కోసం అధికారులు ఇంతగా చేస్తుంటే మేము కూడా ఎందుకు బయటకు వస్తాం అంటున్నారు.ఇండియాలో కూడా కఠినంగా లాక్‌ డౌన్‌ అమలు అవుతుంటే ప్రజలు మాత్రం ఏదో ఒక కారణం చెప్పి బయట తిరుగుతూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube