వేల కోట్ల రూపాయిలు అప్పులు తీసుకొని బ్యాంకులని మోసం చేసి లండన్ వెళ్ళిపోయి అక్కడ దర్జాగా తిరిగుతున్న కార్పోరేట్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందనే చెప్పాలి.బ్రిటన్ లో దర్జాగా తన వ్యాపారాలు చేసుకుంటున్న అతనిపై కేసులు నమోదు చేసిన ఏమీ చేయలేకపోతుంది.
ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ తో దేశ ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.ఇలాంటి వేళలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తాజాగా విజయ్ మాల్యా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
తాను 100శాతం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించేందుకు సిద్ధమని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.దీనిని నేరుగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కి ట్యాగ్ చేశాడు.
ఈ సంక్షోభ సమయంలో తన విజ్ఞప్తిని ఆలకించాలని కోరారు.కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పులు 100శాతం తిరిగిస్తానని, తన కోరిక మన్నించాలన్నారు.
తాను అప్పులు తీరుస్తానన్న బ్యాంకులు మాత్రం సిద్ధంగా లేవని మాల్యా వాపోయారు.బ్యాంకులు తన ఆస్తుల అటాచ్ మెంట్లను విడుదల చేసేందుకు ఈడీ కూడా సిద్ధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని సూచించారు.లాక్ డౌన్ కి తాను కూడా ఒక భారతీయుడుగా సహకరిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశాడు.
మరి అతని అభ్యర్ధనని కేంద్ర ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో అనేది వేచి చూడాలి.