టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఒరియాంటెడ్ చిత్రాలతో తన హవా కొనసాగితున్న పంజాబీ ముద్దుగుమ్మ తాప్సి పొన్ను.తెలుగు దర్శకులు తన టాలెంట్ గుర్తించకపోయినా బాలీవుడ్ వాళ్ళు మాత్రం గుర్తించి ఆమెని నెత్తిన పెట్టుకున్నారు.
దీంతో వరుసగాగా డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేస్తూ తాను ఎంత గొప్ప నటినో అనే విషయం చూపించింది.ఈ భామ తెలుగు సినిమాలకి చాలా వరకు ఫుల్ స్టాప్ పెట్టేసింది అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే హోం క్వారంటైన్ లో ఉంటున్న సెలబ్రిటీలు తమ స్వీయ అనుభవాలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో తాప్సి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది.
తన తొలి టాటూ గురించి దాని వెనుక ఉన్న మెసేజ్ గురించి చెప్పింది.పింక్ సినిమా సమయంలో తన తొలి టాటూని మేడపై వేయించుకున్న.
స్వేచ్చగా రెక్కలు విప్పుకొని ఎగురుతున్న పక్షులు ఆ టాటూలో కనిపిస్తాయి.ఓ పక్షి ఎవరి సహకారం లేకుండా తన స్వశక్తితోనే ఎదుగుతుంది.
నా ఆలోచన కూడా అలాన్తిందే.ఇక నా ఒంటి మీద 2 టాటూలు ఉన్నాయి.
ప్రస్తుతం నేను నా మెడ మీద మూడో టాటూ వేయించుకోవాలనుకుంటాన్నా అంటూ కామెంట్ చేసింది.దాంతో పాటు టాటూ ఫోటోని కూడా షేర్ చేసింది.