ఆ ఊరు పేరు చెప్పగానే పారిపోతున్న జనాలు, పేరులో ఏముంది

కరోనా

పేరు చెప్పగానే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆ మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం తో దాని పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా పారిపోతున్నారు.

 Coronavirus Poses Different Problem For Up Village Called Kourana, Corona Virus,-TeluguStop.com

అయితే ఇలాంటి సమయంలో దాదాపు అదే పేరున్న ఒక ఊరు పేరు చెప్పగానే ఆ గ్రామ ప్రజలన్నా,ఆ ఊరు పేరు విన్నా కూడా ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారట.ఇంతకీ ఆ విలేజ్ పేరు ఏంటంటే

‘కొరౌనా’

ఆ పేరు ఉండడమే ఆ ఊరి ప్రజలకు శాపంగా మారిందట.ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే

యూపీ సీతాపూర్ జిల్లాలో.

కొరౌనా పేరు

ఉండడం తో ఆ గ్రామానికి పట్టిన దుస్థితి ఇది !

కరోనా పేరుకీ, ఈ ఊరు పేరుకి దగ్గరి పోలికలు

ఉండడంతో.అమాయకులైన ఇతర ప్రజలంతా ఈ ఊరివాళ్లంతా కరోనా బాధితులని భయపడిపోతున్నారు.

ఆ విలేజ్ లో ప్రవేశించడానికే జంకుతున్నారట.దీనితో తమ గ్రామానికి ఎవరూ రావడంలేదని, ఇది అసలు తమ ఊరిపేరని చెప్పగానే పారిపోయినంత పని చేస్తున్నారని ఆ గ్రామవాసులు చెబుతున్నారు.

అయితే తమలో ఎవరికీ

కరోనా ఇన్ఫెక్షన్

సోకలేదని, తాము ఆరోగ్యవంతులమని చెప్పినా అనేకమంది నమ్మడంలేదంటూ వారు వాపోతున్నారు.

చివరికి కనీసం వారి

టెలిఫోన్ కాల్స్

కూడా రిసీవ్ చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారట.ఒకవేళ రిసీవ్ చేసుకున్నా ఊరిపేరు చెప్పిన వెంటనే చటుక్కున ఫోన్ పెట్టేస్తున్నారంటూ వారు చెప్పుకొస్తున్నారు.

పోలీసులు

కూడా మమ్మల్ని వింత జంతువుల్లా చూస్తున్నారు అని, దాదాపు సంఘ బహిష్కరణకు గురైనట్లు అయ్యింది అని గ్రామస్తులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube