ఆ ఊరు పేరు చెప్పగానే పారిపోతున్న జనాలు, పేరులో ఏముంది

H3 Class=subheader-styleకరోనా/h3p పేరు చెప్పగానే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆ మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం తో దాని పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా పారిపోతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో దాదాపు అదే పేరున్న ఒక ఊరు పేరు చెప్పగానే ఆ గ్రామ ప్రజలన్నా,ఆ ఊరు పేరు విన్నా కూడా ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారట.

ఇంతకీ ఆ విలేజ్ పేరు ఏంటంటే H3 Class=subheader-style'కొరౌనా'/h3p.ఆ పేరు ఉండడమే ఆ ఊరి ప్రజలకు శాపంగా మారిందట.

ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే H3 Class=subheader-styleయూపీ సీతాపూర్ జిల్లాలో.

కొరౌనా పేరు/h3p ఉండడం తో ఆ గ్రామానికి పట్టిన దుస్థితి ఇది ! H3 Class=subheader-styleకరోనా పేరుకీ, ఈ ఊరు పేరుకి దగ్గరి పోలికలు/h3p ఉండడంతో.

అమాయకులైన ఇతర ప్రజలంతా ఈ ఊరివాళ్లంతా కరోనా బాధితులని భయపడిపోతున్నారు.ఆ విలేజ్ లో ప్రవేశించడానికే జంకుతున్నారట.

దీనితో తమ గ్రామానికి ఎవరూ రావడంలేదని, ఇది అసలు తమ ఊరిపేరని చెప్పగానే పారిపోయినంత పని చేస్తున్నారని ఆ గ్రామవాసులు చెబుతున్నారు.

అయితే తమలో ఎవరికీ H3 Class=subheader-styleకరోనా ఇన్ఫెక్షన్/h3p సోకలేదని, తాము ఆరోగ్యవంతులమని చెప్పినా అనేకమంది నమ్మడంలేదంటూ వారు వాపోతున్నారు.

చివరికి కనీసం వారి H3 Class=subheader-styleటెలిఫోన్ కాల్స్ /h3pకూడా రిసీవ్ చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారట.

ఒకవేళ రిసీవ్ చేసుకున్నా ఊరిపేరు చెప్పిన వెంటనే చటుక్కున ఫోన్ పెట్టేస్తున్నారంటూ వారు చెప్పుకొస్తున్నారు.

H3 Class=subheader-style పోలీసులు/h3p కూడా మమ్మల్ని వింత జంతువుల్లా చూస్తున్నారు అని, దాదాపు సంఘ బహిష్కరణకు గురైనట్లు అయ్యింది అని గ్రామస్తులు చెబుతున్నారు.

ఒడియా అబ్బాయిని పెళ్లాడిన అమెరికన్ వనిత.. ఆమె జీవితం ఎలా మారిందో చూడండి!