తాల్ తెలుగు రచనలకు ఆహ్వానం..!!అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు..!!

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) లండన్ లో స్థిరపడిన భారతీయుల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ.2005 లో ప్రారంభించబడిన ఈ సంస్థ, తెలుగు వారి అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతూ, ఎన్నోరకాలైన సేవలను కూడా అందిస్తోంది.దేశభాషలందు తెలుగు లెస్స అంటూ, అక్కడ స్థిరపడిన తెలుగు వారి పిల్లలకు కూడా తెలుగు భాషను నేర్పిస్తూ, సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు.అయితే, తాల్ ఈ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించే భాగంలో తెలుగు రచనలకు ఆహ్వానం కోరుతోంది…

 Ugadi Celebrations In Tal-TeluguStop.com

బ్రిటన్ లో నివశించే తెలుగు వారందరికి సాదర ఆహ్వానం అందిస్తూ తాల్ 28 మర్చి, 2020న ఉగాది వేడుకలను నిర్వహించబోతోంది.

ఈ వేడుకలకు వేదికగా నవ్నాట్ సెంటర్, ప్రిటింగ్ హౌస్ లేన్, హఎస్ UB3, 1AR గా నిర్ణయించారు.మధ్యాహ్నం 1pm నుంచి రాత్రి 10pm వరకూ వేడుకలు జరగనున్నాయి.

Telugu Britain, London, Maa Telugu, Telugu Nri, Ugadi-Telugu NRI

ఈ సంబరాల్లో ఏర్పాటు చేసిన సంగీత విభావరికి సింగర్స్ సుమంగళి, దీపు, శ్రీకాంత్, రానున్నారు.మిమిక్రి ఆర్టిస్ట్ రాజు తన మిమిక్రీతో అందరిని అలరించనున్నారు.ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉగాది పండుకలో అతి ముక్యమైన పంచాంగ శ్రవణం కూడా వినిపించనున్నారు.

Telugu Britain, London, Maa Telugu, Telugu Nri, Ugadi-Telugu NRI

తాల్ “మా తెలుగు” పేరుతో ఒక వార్షిక సంచికను కూడా విడుదల చేస్తూ, అందులో ప్రచురించడానికి బ్రిటన్ లో ఉండే తెలుగు వారి నుంచి తెలుగు రచనలు, కవితలు, కథలకై ఆహ్వానం ఇచ్చారు.అయితే సొంత రచనలు మాత్రమే పంపాలని, ఒక వేల ఇతరుల రచనలు పంపిన యెడల వారి అనుమతి పత్రం కూడా జోడించి పంపవచ్చని తెలిపారు.పంపిన వాటిలో ఎంపికైన రచనలను మా తెలుగు సంచికలో ప్రచురిస్తామని, ఇందుకోసం విడుదల చేసిన పోస్టర్లో ప్రకటించారు[email protected] అనే చిరునామాకి ఫిబ్రవరి 28 లోగా రచనలు పంపవలసి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube