యువతిపై అత్యాచారం చేసిన మరో యువతి....

కొన్ని పాశ్చాత్య దేశాల్లో స్వలింగ సంపర్కం తప్పు కాకపోయినప్పటికీ ఇష్టం లేకుండా చేయడం నేరం.అయితే తాజాగా ఓ బతుకుతెరువు కోసం వచ్చినటువంటి ఓ యువతి పై కన్నేసిన మరో స్వలింగ సంపర్కురాలు అయినటువంటి యువతి తనతో సహజీవనం చేయడానికి ఒప్పుకోలేదని ఆమెపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన పారిస్ దేశంలో చోటు చేసుకుంది.

 Sona Living Togather-TeluguStop.com

వివరాల్లోకి వెళితే సోనా అనే 21సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి పారిస్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ హోటల్లో పనిచేస్తూ ఉండేది.ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళతో ఆమెకు పరిచయం ఏర్పడింది.

అయితే సోనా కి పరిచయం అయిన మహిళ ఓ స్వలింగ సంపర్కురాలు.దీంతో ఆమె పలుమార్లు సోనా ని తనతో సహజీవనం చేయాలని కోరింది.

   అయితే ఆమెతో సహజీవనం చేయడానికి సోనా అంగీకరించలేదు.

Telugu Paris, Raped-Telugu NRI

దీంతో సోనా అనే యువతిపై పై మరో మహిళ కక్ష పెంచుకుంది.అంతేగాక ఆమెను బలవంతంగా అనుభవించాలని తన స్నేహితురాలైనటువంటి మరో మహిళతో కలిసి పన్నాగం పన్నింది.పథకంలో భాగంగా పని ముగించుకొని బయటకు వస్తున్నటువంటి సోనా ని ఇద్దరు యువకులు కలిసి కిడ్నాప్ చేసి కృత్రిమ శృంగారానికి ఉపయోగించే వస్తువులతో సోనా పై అత్యాచారం చేశారు.

అంతేకాక ఆమెని నగ్నంగా రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు.అయితే వారి ఆకృత్యాలకు బెదిరిపోయినటువంటి సోనా అపస్మారక స్థితిలోకి చేరుకుంది.

దీంతో ఇది గమనించిన టువంటి స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు.అలాగే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.అనంతరం బాధితురాలు సోనా స్పృహలోకి రాగానే తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు వివరించింది.

దీంతో నిందుతురాళ్ళను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube