తెలుగులో ఈటీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే అదిరింది కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే ఈ కామెడీ షో లో భాగంగా వచ్చేటువంటి స్కిట్లలోప్రతుతం ట్రేండింగ్ లో ఉన్న విషయంపై పంచులు, సెటైర్లు వేయడం కామన్.
అయితే ఇటీవల కాలంలో ఎస్విబిసి మాజీ చైర్మన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఓ మహిళతో మాట్లాడినటువంటి సంభాషణ ఫోన్ రికార్డింగ్ విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా పృథ్వి మహిళను వెనకనుంచి పట్టుకుందామనుకున్నా కాని అరుస్తావ్ అని వదిలేశా.
అనే మాటలని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి నెట్టింట్లో బాగా ట్రోల్ అవుతోంది.

దీంతో జబర్దస్త్ పలువురు కమెడియన్లు కూడా తమ స్కిట్ లో భాగంగా ఈ సంభాషణ ని ఉపయోగిస్తూ సెటైర్లు వేస్తున్నారు.వీటికి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.అయితే అదిరింది షో తాజాగా విడుదల చేసినటువంటి ఈ వారపు ప్రోమో లో కూడా పృథ్వి డైలాగ్ గట్టిగానే వాడారు.
అయితే పృథ్వి మాత్రం ఏదో ఒక్కసారి మాట్లాడినప్పటికీ ఆ మాటలని ఉపయోగించి పలురకాల టిక్ టాక్ వీడియోలు మరియు ఈ మాటలకు మరి కొన్ని డైలాగులు జోడించి ఎడిటింగ్ చేసిన వీడియోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.