కాళిదాసు చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమై తనకంటూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని హీరో సుశాంత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో దాదాపుగా వరుస హిట్లతో అలరించినటువంటి సుశాంత్ ప్రస్తుతం గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక పోవడంతో హిట్ కోసం తపిస్తున్నాడు.
అయితే తాజాగా సుశాంత్ ప్రముఖ దర్శకుడు ఎస్. దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనములు నిలుపు రాదు అనే చిత్రంలో నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రం ఈ రోజున నటీనటులు మరియు దర్శకనిర్మాతల సమక్షంలో ఈ రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించి అధికారికంగా లాంచ్ చేశారు.
అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి ఏఎస్ఐ స్టూడియోస్ సంస్థ మరియు సహస్ర మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అయితే గతంలో సుశాంత్ నటించినటువంటి చి.ల.సౌ ఆటాడుకుందాం రా, చిత్రాలు కొంతమేర నిరాశ మిగిల్చాయి.దీంతో కచ్చితంగా ఈచిత్రంతో హిట్టు కొట్టాలని సుశాంత్ సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కీ రాజు అందిస్తున్నారు.