వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రతి బిల్లును దురుద్దేశ పూర్వకంగా తెలుగు దేశం పార్టీ మండలిలో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని, అందుకే మండలిని రద్దు చేయడం ద్వారా ప్రజాస్వామ్యంను కాపాడటంతో పాటు ప్రజా ధనం కాపాడబడుతుందని జగన్ ప్రభుత్వం మండలి రద్దును అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది.అసెంబ్లీలో తీర్మానం చేయగానే రద్దు అయ్యేందుకు అదేమైనా చిన్న చితక సభ కాదు.
పెద్దల సభ, రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు అయిన సభ అంటూ టీడీపీ నాయకులు అంటున్నారు.
తాజాగా టీడీపీ ఎంపీ నాని మాట్లాడుతూ.
మీరు తీర్మానం చేసి పంపిన వెంటనే కేంద్రం మండలిని రద్దు చేస్తుందని మీరు అనుకుంటే మీ అవివేకం అవుతుంది జగన్‌గారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మండలి అనేది రద్దు కానే కాదు అంటూ నాని చాలా నమ్మకంగా చెబుతున్నాడు.
ఢిల్లీ పరిణామాలు దగ్గరగా చూస్తున్న ఆయన చేసిన వ్యాఖ్యలతో నిజంగానే మండలి రద్దు కాకుండా ఉంటుందా అని చాలా మంది అనుకుంటున్నారు.ఢిల్లీలో మండలి రద్దు గురించి ఎలాంటి చర్చ జరుగుతుంది, మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా అనేది కొన్ని రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.