సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న మోకాళు నొప్పికి ఇటీవలే అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెల్సిందే.మొదట మహేష్‌బాబుకు రెండు నెలల విశ్రాంతి అవసరం అంటూ డాక్టర్లు చెప్పారట.
దాంతో తన 27వ చిత్రంను మహేష్‌బాబు రెండు నెలల తర్వాత మొదలు పెట్టాలనుకున్నాడు.కాని ఇప్పుడు మహేష్‌బాబు మరో రెండు నెలలు అదనంగా విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు చేయబోతున్న చిత్రం జేమ్స్ బాండ్ స్టైల్‌లో ఉండబోతుందట.ఆ కారణంగా సినిమా కోసం యాక్షన్ సీన్స్‌ను చేయాల్సి ఉంటుందట.అందుకే సినిమా కోసం రంగంలో దిగే ముందు పూర్తి ఫిట్ నెస్‌ను సాధించాలనే ఉద్దేశ్యంతో మహేష్‌బాబు ఉన్నాడు.ఆపరేషన్ చేయించుకున్న ఉద్దేశ్యం కూడా అదే.ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతూ వస్తున్న నొప్పికి ఆపరేషన్ చేయించుకున్నాడు.
మహేష్ బాబు 25వ చిత్రం మహర్షితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమాతో మహేష్‌బాబుకు వంశీ పైడిపల్లి సూపర్ హిట్ అందించాడు.అందుకే ఆయనపై నమ్మకంతో తన 27వ చిత్రం దర్శకత్వ బాధ్యతలను కూడా వంశీకే ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందనుకున్న సమయంలో మహేష్ బాబు విశ్రాంతిని మరింత కాలం తీసుకోవాలనుకోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.