ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే.పెద్దా చిన్న అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లలో తమ మొహాలు పెట్టి సగం జీవితాన్ని సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు.
అంతలా సోషల్ మీడియాకు జనం అలవాటేపడిపోయారు.కానీ సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
తాజాగా సోషల్ మీడియా కారణంగో తన భార్యను కిరాతకంగా చంపాడు ఓ ప్రబుద్ధుడు.
రాజస్థాన్‌లోని రాంగఢ్ మోద్‌కు చెందిన అయాజ్ అహ్మద్ అన్సారీ(26), నైనా మంగ్లానీ(22) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరి కాపురం సంతోషంగా సాగుతుందని వారు మురిసిపోయారు.కానీ నైనాకు ఫేస్‌బుక్ వాడే అలవాటు ఎక్కువగా ఉండేది.
ఎంతలా అంటే తన బిడ్డను పట్టించుకునేంత తీరిక లేదని అయాజ్ ఆమెపై తరచూ ఆగ్రహించేవాడు.నైనాకు ఫేస్‌బుక్‌లో ఎవరితోనో అక్రమ సంబంధం ఏర్పడ్చుకుందని అతడు అనుమానించాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి.
గొడవల కారణంగా నైనా తన పుట్టింటికి వెళ్లిపోయింది.ఈ క్రమంలో అయాజ్ నైనా వద్దకు వెళ్లి రాజీపడదామని చెప్పి ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు.అతడిని నమ్మిన నైనా స్కూటీపై అతడితో వెళ్లింది.
కాగా ఆమెను కొండ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి, బండరాయితో తలపై కొట్టాడు.నైనా మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు.
ఓ పచ్చని కాపురంల ఫేస్‌బుక్ ఎలా చిచ్చుపెట్టిందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.