జంతు ప్రేమికుల ఇళ్ళలో ఎక్కువగా పెంచుకునేవి శునకాలు.వాటితో ఆటలు ఆడటం, మాములు మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడటం, అవి చేసే పనులు చూసి మురిసిపోవటం చేస్తుంటారు.
ఇంకా చెప్పాలంటే ఆ శునకాలు ఇంటి సభ్యులు అయిపోతాయి.ఇంకొంత మంది అయితే వారు తినే ఆహార అలవాటులే వారి పెంపుడు జంతువులకు కూడా అలవాటు చేస్తారు, ఇక అవి కూడా అలవాటైనవి తప్ప ఇంకేమి తినము అన్నట్టు ఉంటాయి.
ఇంట్లో పెంచుకునే కుక్కల విషయం లో ఇదంతా ఓకే, కాని ఓ వీధి కుక్క తనకి ఇష్టమైన ఆహార పదార్ధాల కోసం సంవత్సర కాలంగా ఒకే చోటుకు వెళ్తోంది.వాళ్ళు డానికి అది తినే తిండి పెడితే తిని అక్కడి నుంచీ వెళ్ళిపోతోంది.
ఏంటి నమ్మడం లేదా సరే ఈ స్టొరీ చదివితే మీకే అర్థమవుతుంది.మెక్సికో లో ఉన్న సబ్వే కు ఈ వీధి కుక్క సంవత్సరం నుంచి రెగ్యులర్ కస్టమర్.
అదేంటి కుక్క రెగ్యులర్ కస్టమర్ ఏంటి అనుకోకండి, ఇదే నిజం, అలా అని అది తింటున్న ఫుడ్ కు ఎవరు బిల్ కూడా కట్టరు…
ప్రతీ రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ వీధి కుక్క ఆ ఫుడ్ కోర్ట్ తలుపుల దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, అది గమనించి ఆ సబ్వే సిబ్బంది దానికి ఆహారాన్ని అందిస్తున్నారు.ఇదే సీన్ అక్కడ ఒక సంవత్సర కాలంగా రిపీట్ అవుతోందట.
అదిలా రోజు రావటం, పెట్టిన ఫుడ్ తిని వెళ్ళిపోవటం, చూసి ముచ్చటేసి అక్కడ సిబ్బందిలో ఒకరు ఇదంతా వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ సబ్వే సాలీ, ఆ సబ్వే రెండు బాగా ఫేమస్ అయిపోయాయ్.
ఆ వీధి కుక్కకి సబ్వే సాలీ అని పేరు పెట్టింది కూడా ఇక్కడి సిబ్బందే.అయితే ఆ టిక్‌టాక్ వీడియోను చూసిన వారిలో చాల మంది లైక్స్ కొట్టారు, కొంత మంది మాత్రం మాకు సబ్వే సాలీ కావాలి, దానిని పెంచుకుంటామంటూ ముందుకు వచ్చారు.కాని సబ్వే సాలీ ఎవరితోనూ వెళ్ళటానికి ఇష్టపడకపోవటం అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.