టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు రికార్డులు సాధించడం అంటే అవి కేవలం నాన్ బాహుబలి రికార్డ్ లు అన్నట్లే.ఆ నాన్ బాహుబలి రికార్డులు ఇప్పటి వరకు మహేష్ బాబు, పవన్, ఎన్టీఆర్, రాంచరణ్ సాధించే వారు.
కానీ ఇప్పుడు అనూహ్యంగా అల్లు అర్జున్ ఈ రికార్డ్ ను దక్కించుకున్నాడు.అలా వైకుంఠపురంలో సినిమాతో బన్నీ రికార్డ్ కొట్టాడు.
ఈసారి ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్ ను కొట్టాడు.
అల్లు అర్జున్ మొదటిసారి నాన్ బాహుబలి రికార్డ్ ను దక్కించు కోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
త్రివిక్రమ్ దయ వల్ల బన్నీ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు అంటూ సినీ వర్గాలు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బన్నీ ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఏది కూడా వంద కోట్లకు దక్కించుకున్న దాఖలాలు లేవు.
కానీ మొదటి సారి వారం కాకుండానే బన్నీ 100 కోట్ల వసూళ్లు.అది కూడా షేర్ అవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.ఈ సినిమా జోరు చూస్తుంటే 20 కోట్ల షేర్ ఖాయం అనిపిస్తుంది.అదే జరిగితే బాహుబలి 1 సినిమా రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.
అందుకే ఈ వార్త బన్నీ ఫ్యాన్స్ గల్లా ఎగరేసేది.