కొన్ని సంఘటనలు యాదృస్చికంగా జరిగిన అవి అందరిని షాక్ కి గురి చేస్తాయి.అలాగే కొంత మంది పెళ్లి వేడుకలని చాలా క్రియేటివ్ గా జరుపుకోవాలని భావిస్తూ ఉంటారు.
అయితే కొన్ని పెళ్లి వేడుకలు మాత్రం మామూలుగా జరుపుకున్న చాలా క్రియేటివ్ గా మారిపోతాయి.ఇప్పుడు అలాంటి పెళ్లి వేడుకకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫిలిప్పైన్స్‌కు చెందిన చీనో వాఫ్లర్, క్యాట్ బతిస్తా పాలోమర్ అనే యువతీయువకులు లూజాన్ దీవిలోని ఓ రిసార్టులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకొని పెళ్లి వేడుకకి సిద్ధమయ్యారు.
అయితే ఊహించని విధంగా వారి పెళ్లి వేడుక జరిగే ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాల్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది.దీంతో కంగారుపడిన అందరూ పెళ్లి వాయిదా వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని భావించారు.
కానీ వాఫ్లర్ జంట దానికి అంగీకరించలేదు.యధావిధిగా పెళ్లిజరగాలని పట్టుబట్టింది.
భారీ ఎత్తున పొగలు వస్తున్న అగ్నిపర్వతం బ్యాక్‌గ్రౌండ్లో వారిద్దరూ ఉంగరాలు మార్చుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చారు.ఈ పెళ్లి ఫోటోలలో తాల్ అగ్నిపర్వతం నుంచి ఎగసిపడుతున్న పొగలు అద్బుతంగా వచ్చాయి.
ఏదో సాదాసీదాగా చేసుకుందామనుకున్న పెళ్లి వేడుక ఇలా అగ్నిపర్వతం బ్యాక్ డ్రాప్ లో అద్బుతంగా జరగడంతో ఆ జంట తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.దీంతో వారి పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.