సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు తెరకేక్కిస్తూ హిట్స్ కొడుతున్నారు.మరో వైపు చిన్న సినిమాలని కూడా తన బ్యానర్ మీద రిలీజ్ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇక ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం హిరణ్యకశిప రానా టైటిల్ రోల్ లో తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఆ మధ్య కొరియన్ నుంచి ఓ బేబీ సినిమాని సమంత లీడ్ రోల్ లో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు.
సమంత లేడీ ఒరియాంటెడ్ గా తెరకెక్కిన ఆ సినిమా ఆమెకి కెరియర్ లో బెస్ట్ హిట్ ఇచ్చింది.ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తూనే సమంత మళ్ళీ అదిరిపోయే కథ కోసం చూస్తుంది.
ఇదిలా ఉంటే సురేష్ బాబు మళ్ళీ ఓ కొరియన్ మూవీని రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
పోలీసుల ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకుల కథతో తెరకెక్కిన మిడ్ నైట్ రన్నర్స్ సినిమాను తెలుగులో రీమేక్ కి ప్లాన్ చేస్తున్నారు.
పోలీష్ అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో ఓ కిడ్నాప్ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడటం ఈ సినిమా కథ.అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఇద్దరు కుర్రాళ్ళని ఇద్దరు అమ్మాయిలుగా మార్చి స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తునట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.ప్రధాన పాత్రలకు రెజీనా, నివేదా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.
ఈ సినిమాకు సుధీర్ వర్మని దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు సమాచారం.