వంద అడుగుల ఎత్తుపై నుంచి సెల్ఫీ తీసుకోవాలనే తన కోరిక ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఓ ప్రముఖ మోడల్ ప్రాణాలను తీసింది.
వివరాల్లోకి వెళితే ప్రముఖ ప్రముఖ వర్ధమాన మోడల్ మరియు వరల్డ్ టూరిస్ట్ మోడలిన్ డేవిస్ తన మిత్రులతో కలిసి ఇ ఆస్ట్రేలియాలోని డైమండ్ రిజర్వు బే రిజర్వ్ అనే అనే పర్వతాలపై కి సరదాగా గడపడానికి వెళ్లారు.
ఇందులో భాగంగా మోడలిన్ వంద అడుగుల ఎత్తు గా ఉన్నటువంటి ఈ పర్వతం పైకి వెళ్ళింది.ఈ క్రమంలో తన తరవాణిలో సెల్ఫీలు తీసుకోవడం ప్రయత్నించింది.
అయితే ఇలా సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయింది. దీంతో ఆమె ఎత్తైన ప్రదేశం నుండి సముద్రంలోకి పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
దీంతో ఆమెకి ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.అంతేగాక ప్రస్తుతం ఇంటర్ నెట్ లో కూడా నెటిజన్లు ఈమె విషయాలు గురించి అధికంగా వెతుకుతున్నారు. మోడలింగ్ లో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆమె ఇలా అర్ధాంతరంగా కాలం చేయడంతో ఆమె అభిమానులు జీర్నించు కొలేకపోతున్నారు.