ఈ టీవీ ఛానల్ లో ప్రతీ గురు,శుక్ర వారాల్లో ప్రసారమయ్యే అటువంటి జబర్దస్త్ కామెడీ షో ఎంతగా ప్రేక్షక ఆదరణ పొందిందో చెప్పనవసరం లేదు.అయితే ఇందులో ఎక్స్ట్రా జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేసేటువంటి సుడిగాలి సుదీర్ మరియు బ్యూటిఫుల్ యాంకర్ రష్మీ జోడికి కూడా మంచి పాపులారిటీ ఉంది.
అయితే ఇప్పటికే వీరిద్దరి మంచి జోడి చాలా బాగుంటుందని ప్రేక్షకులు ఈ జోడి కి బాగానే కనెక్ట్ అయ్యారు.
అయితే తాజాగా గత వారంలో ప్రసారం అయినటువంటి సుడిగాలి సుధీర్ స్కిట్ లో హీరో మరియు కమెడియన్ అయినటువంటి బిత్తిరి సత్తి హల్ చల్ చేశారు.
ఇందులో భాగంగా మొదటగా బిత్తిరి సత్తి ఒక ఎన్నారైగా రష్మిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు.అయితే ఆ తర్వాత అతడు ఎన్నారై కాదని తెలుస్తుంది.అప్పుడు సుడిగాలి సుదీర్ తన మనసులో మాట బయటపడుతూ పక్కనున్న తనను పట్టించుకోకుండా వేరే వాళ్ళని చూస్తున్నావని ఎమోషనల్ డైలాగ్ లు చెబుతాడు.దాంతో కనెక్ట్ అయిన రష్మీ కరిగిపోతుంది.
ఆ తర్వాత ఇద్దరు సెల్ఫీలు తీసుకోవాలనుకుం టారు.ఈ సమయంలో ప్రియ అనే నంబర్ నుంచి సుదీర్ కి మెసేజ్ వస్తుంది.
అప్పుడు దాన్ని కవర్ చేసుకునేందుకు సుదీర్ ప్రయత్నించగా రష్మీ ఛీ నీ బుద్ధి ఎప్పటికీ మారదని తిట్టి వెళ్లి పోతుంది.
అయితే ఇదంతా స్కిట్ లో బాగంగా చేసినప్పటికీ జనాలు మాత్రం చాలా బాగా ఈ స్కిట్ కి బాగా కనెక్ట్ అయ్యారు ఎంతలా అంటే ఈ స్కిట్ ని యూట్యూబ్ లో పెట్టిన రెండురోజులకే 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రేక్షకుల్లో రష్మీ, సుధీర్ జోడికి ఎంత క్రేజ్ ఉందో అని….