హీరోగా అనేక సినిమాల్లో నటించి ఆ తరువాత రాజకీయాలపై మనసు పారేసుకున్న శివాజీ తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా పాపులర్ అయ్యాడు.ఏపీవిషయంలో బిజెపి ఏ విధమైన కుట్రలకు పాల్పడబోతోందో ముందుగానే చెబుతూ ఉండేవారు.
దీంతో ఆయన పేరు కాస్తా గరుడ పురాణం శివాజీగా బాగా పాపులర్ అయ్యింది.ఇక ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్న శివాజీ మళ్లీ ఏపీలో రాజధాని వ్యవహారంలో స్పందించేందుకు బయటకి వచ్చాడు.
అదే విషయంపై శివాజీ మీడియా సమావేశం పెట్టి స్పందించాడు.రాజధాని మార్పు అనేది ఎన్నికలకు ముందే జగన్ నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చు మొత్తం ఒక్కసారిగా సంపాదించుకునేందుకు రాజధానిని అమరావతి నుంచి దూరం చేస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చారు.
టిడిపి అధినేత చంద్రబాబు కుల పిచ్చి ఉంటే కమ్మ వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే కియా మోటార్స్ పెట్టేవారని, అనంతపురం జిల్లా ఎందుకు పెడతారన్నారు.అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడినట్లు ప్రభుత్వం దగ్గర తగిన ఆధారాలు ఉంటే వారిపై వెంటనే కేసు పెట్టాలని శివాజీ వ్యాఖ్యానించారు.అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చారని ఆయన అన్నారు.రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చు పెట్టారని, జగన్ టిడిపి పై పంతంతో తన రాజకీయ పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడని శివాజీ విమర్శించారు.
జగన్ కనుక అమరావతిలోనే రాజధానిని కొనసాగించి ఉంటే ప్రజలంతా చంద్రబాబును మరిచిపోయి ఉండేవారని, ఇప్పుడు విశాఖ లో వెయ్యి ఎకరాలు కూడా భూసేకరణ చేయలేరని, అసలు రాజధానిగా విశాఖను చేయడం వల్ల ఏ లాభం ఉండదని శివాజీ అన్నారు.జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిందని చెబుతున్నారని వాలంటీర్ ఉద్యోగాలు అన్ని వైసిపి వాళ్ళ కే ఏ కదా ఇచ్చామని ఆ పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని, అసలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని శివాజీ ప్రశ్నించారు.హైకోర్టు వల్ల కర్నూలు కు పెద్దగా ఒరిగేది ఏమీ లేదని, రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరం లేదంటూ శివాజీ చెప్పుకొచ్చారు.