తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల విజిల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసుకుని విజయ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చింది.
తాజాగా విజయ్ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమా ఓ విదేశీ సినిమాకు కాపీ పేస్ట్ అంటున్నారు తమిళ సినీ జనం.కొరియన్ చిత్రం ‘సైలెన్స్‌డ్’ అనే సినిమాకు ఇది పూర్తి రీమేక్ అనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కరలు కొడుతోంది.దీంతో విజయ్ లాంటి స్టార్ హీరోకు వేరే భాష చిత్రాన్ని కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదని, ఉంటే వారు అఫీషియల్‌గా చెబుతారని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.కాగా విజయ్ నటిస్తోన్న ఈ సినిమాకు ‘మాస్టర్’ అనే టైటిల్‌ను ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
మరి విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రం నిజంగానే మక్కీకి మక్కి దించేస్తు్న్నారా లేక లోకేష్ కనకరాజ్ తన క్రియేటివిటీతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడా అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.