నందమూరి బాలకృష్ణ ఇటీవల రూలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమాలో సత్తా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది.
తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈ సినిమాను ఎందుకు తీశాడో, బాలయ్య అసలు ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడో అర్ధంగాక నందమూరి అభిమానులు జుట్టు పీక్కున్నారు.
ఇకపోతే ఇప్పుడు బాలయ్యకు చాలా అవసరమైన సక్సెస్‌ను తానిస్తానంటూ ముందుకొచ్చిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య రెండు హిట్ సినిమాలు తెరకెక్కిచ్చాడు.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా రానుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించాల్సిందిగా పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించగా వారు ససేమిరా అన్నారట.
తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని బోయపాటి కోరాడట.
అయితే బాలయ్యతో సినిమా అనగానే తమన్నా నో అంటూ చెప్పేసిందని టాక్.అసలే తన కెరీర్ ప్రస్తుతం స్లోగా నడుస్తోందని, బాలయ్యతో సినిమా చేస్తే, అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే తన పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తమన్నా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్.
ఏదేమైనా బాలయ్య సరసన నటించిన చాలా మందికి మంచి కెరీర్ లభించిందని, అసలే సినిమాలు లేని తమన్నా ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.తమన్నా రాబోయే సినిమాలు ఎంతమేర ఆడుతాయో తామూ చూస్తామని వారు సవాల్ విసురుతున్నారు.