రెండున్నర సంవత్సరాల నుంచి ఓ ఎన్నారై ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన చేప తలను కొచ్చి వైద్యులు తొలగించి అతనిని నరకయాతన నుంచి రక్షించారు.వివరాల్లోకి వెళితే… కేరళకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఖతార్‌లో పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో అతను న్యూమోనియా కారణంగా ఐదుసార్లు ఆసుపత్రిలో చేరాడు.అయినా ఆయన పరిస్ధితి మెరుగుపడకపోగా.
జ్వరం, తీవ్రమైన దగ్గుతో కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరారు.
పరీక్ష సందర్భంగా తాను రెండున్నర సంవత్సరాల క్రితం, ఎయిర్‌పోర్టులో ఫిష్ ఫ్రై తిన్నానని వైద్యులకు తెలిపాడు.
ఒక నెల తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది, అప్పటి నుంచి అతను తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు.దీని ఆధారంగా బ్రోంకోస్కోపిక్ విధానం ద్వారా వైద్యులు అతని ఊపిరితిత్తుల్లో కుడి దిగువ భాగాన 5×3 సెం.మీ వ్యాసార్థంతో చేప తల భాగాన్ని కనుగొన్నారు.
దీని వల్ల ఆ ప్రాంతంలో చీము పట్టి న్యూమోనియాకు కారణమైందని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ జోసెఫ్ తెలిపారు.ఖతార్‌లోని వైద్యులు ఎక్స్‌రే, సిటి స్కాన్‌లు నిర్వహించారని అయితే ఈ పరీక్షల ద్వారా చేప తల భాగాన్ని గుర్తించడం అసాధ్యమని కొచ్చి వైద్యుల బృందం వెల్లడించింది.శస్త్రచికిత్స జరిగిన 48 గంటల్లోనే ఎన్ఆర్ఐ డిశ్చార్జి అయినట్లు అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది.