ఉంటే ఇద్దరూ వైసీపీలో ఉండండి లేకపోతే ఇద్దరూ బీజేపీలో అయినా ఉండండి అంతే కానీ భార్య ఒక పార్టీలో భర్త ఒక పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు, ఏదో ఒక విషయం మీరు తేల్చుకోవాల్సిందే అంటూ వైసీపీ హైకమాండ్ దగ్గుపాటి వెంకటేశ్వరావు కు గడువు విధించడంతో ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిలోకి వెళ్ళిపోయాడు.

దగ్గుపాటి భ్యార్య పురందరేశ్వరి బీజేపీ నాయకురాలిగా కీలక బాధ్యతలు వహిస్తుండడంతో పాటు ఏపీలో వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే ఇదే సమయంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైసీపీలోనే కొనసాగుతున్నారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తన భర్త దగ్గుబాటికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని బీజేపీలో ఉంటున్న పురందేశ్వరి ఘాటుగా విమర్శించడం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారింది.

దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతుండడంతో పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి.ఈ గొడవ ఇలా ఉండగానే పర్చూరు నియోజకవర్గంలో పలు మార్పులు జరిగాయి.భార్య, భర్త చెరో పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేసుకోవడం సరికాదన్న భావన వైసీపీలో నెలకొంది.
ఈ నేపథ్యంలో పురందేశ్వరిని కూడా పార్టీలోకి తీసుకురావాల్సిందిగా జగన్ కోరినట్టు వార్తలు వినిపించాయి.అమెరికా నుంచి పురందేశ్వరి గురువారం హైదరాబాద్ వచ్చారు.ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలపై కుటుంబసభ్యులు ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ కంటే కేంద్ర అధికార పార్టీగా ఉన్న బీజేపీలోకి వెళ్తేనే తమ రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ఢోకా ఉండదని దగ్గుపాటి ఫ్యామిలీ అంతా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.పురందేశ్వరిని బీజేపీలోనే కొనసాగించి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంతిమంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు ఆలోచించినప్పటికీ తన కోసం మీ రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టవద్దని హితేష్ సూచించినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు దగ్గుపాటి తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.