రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన నందమూరి బాలకృష్ణ..!!

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.“తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి.గారికి శుభాకాంక్షలు.ప్రజాసేవ పరమావధిగా రాజకీయాలలో అంచలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు.

 Nandamuri Balakrishna Congratulated Revanth Reddy , Congress, Nandamuri Balakris-TeluguStop.com

తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నెరవేర్చాలని అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.ముఖ్యమంత్రిగా మీ మార్క్ పాలనతో తెలంగాణ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరోత్సవానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.గురువారం ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube