మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర మరియు దిల్‌రాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం క్రేజ్‌ను పెంచేందుకు మాంచి మాస్ మసాలా ఐటెం సాంగ్‌ను దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

అనీల్ తన గత చిత్రం ఎఫ్ 2 తో తమన్నాకు మంచి బూస్ట్ ఇచ్చాడు.అందుకే ఆయన కోసం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పింది.తమన్నా గతంలో చేసిన ఐటెం సాంగ్స్‌ను మించి ఈ ఐటెం సాంగ్ ఉండేలా దర్శకుడు అనీల్ ప్రయత్నిస్తున్నాడట.విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఐటెం సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారట.దాదాపు కోటి రూపాయల సెట్టింగ్‌ను ఈ ఐటెం సాంగ్ కోసం వేయాలని ఇప్పటికే నిర్ణయించారు.వచ్చే నెలలో వారం నుండి పది రోజుల పాటు తమన్నా మరియు మహేష్ బాబులపై ఈ ఐటెం సాంగ్ చిత్రీకరించబోతున్నారు.
ఈ ఐటెం సాంగ్‌ను 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు.అప్పటి పరిస్థితులు ప్రతిభింబించేలా సెట్‌ను డిజైన్ చేసి ఆ తర్వాత సినిమాను ప్లాన్ చేయబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌ను మరింతగా పెంచేందుకు తమన్నాతో అనీల్ రావిపూడి చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమాలో తమన్నాకే ఎక్కువ స్కోప్ మరియు పబ్లిసిటీ దక్కబోతుందని ఐటెం సాంగ్ గురించి వింటూ ఉంటే అనిపిస్తుంది.