యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కేవలం తెలుగులో మాత్రమే స్టార్ హీరో కాదు.ఈయన ఆల్ ఇండియా స్టార్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాహుబలి మరియు సాహో చిత్రంతో ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అంటూ నిరూపించుకున్నాడు.యావరేజ్ టాక్ వచ్చిన సాహో చిత్రంకు బాలీవుడ్‌లో వచ్చిన కలెక్షన్స్ చూసి అంతా అవాక్కవుతున్నారు.
అలాంటి ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాహుబలి మొదటి పార్ట్ విడుదలైనప్పటి నుండే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కాని ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన వార్ చిత్రం సీక్వెల్‌ను ప్రభాస్ చేయబోతున్నాడట.ఆ సినిమాకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రభాస్‌తో యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు చేస్తున్నారంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వార్ సినిమాలో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్‌లు నటించారు.హృతిక్ స్థాయిలో టైగర్ ష్రాఫ్ ఆకట్టుకోలేదు.అందుకే వార్ 2 సినిమాలో హృతిక్ కు సరిజోడిగా నిలిచే ప్రభాస్‌ను ఎంపిక చేయాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రభాస్‌కు బాలీవుడ్ సినిమా చేయాలనే కోరిక అయితే ఉంది.అయితే అది వార్ 2తో జరుగుతుందా చూడాలి.
వార్ 2 చిత్రంలో హృతిక్ మరియు ప్రభాస్ ఉంటే బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈజీగా 100 కోట్లు రాబట్టే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం.ఈ వార్త నిజం అయితే ప్రభాస్‌కు ఇంతకు మించిన పండగ ఉండదు.