ప్రధాని నరేంద్ర మోడీ వెయ్యి మరియు అయిదు వందల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే.కొత్తగా రెండు వేల రూపాయల నోట్లు మరియు పాత నోట్లు అన్ని కూడా కొత్త డిజైన్స్‌లో ముద్రించడం జరుగుతుంది.
నోట్ల రద్దు తర్వాత అవినీతి తగ్గుతుందని, బ్లాక్ మనీ తగ్గుతుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా ఆ పాత నోట్లు అన్ని కూడా కొత్త నోట్లుగా మారిపోయాయి.
ఇదే సమయంలో రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసి వెయ్యి నోట్లను మళ్లీ తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఆర్బీఐ ఒక కొత్త వెయ్యి నోటును కూడా డిజైన్ చేసింది అంటూ వెయ్యి రూపాయల నోటు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త వెయ్యి నోటు పూర్తిగా నిజం కాదని, అసలు ఆర్బీఐ ఇప్పటి వరకు వెయ్యి నోటకు సంబంధించి ఎలాంటి నిర్ణయానికి రాలేదు అంటూ అధికారులు ప్రకటించారు.ప్రస్తుతం ఆర్బీఐ నుండి రెండు వేల నోట్ల ముద్రణ ఆగిపోయింది.
కొత్త వెయ్యి రావడం మాత్రం కన్ఫర్ అని, ఇది ఆ అఫిషియల్ కాదని అంటున్నారు.