తూర్పు గోదావరి జిల్లాలో గత నెలలో మునిగి పోయిన టూరిస్ట్ బోటు వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.కొన్ని రోజుల క్రితం వారు చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే బోటు ఎక్కడ ఉందనే విషయాన్ని గుర్తించినట్లుగా ధర్మాడి సత్యం ప్రకటించాడు.ఒడ్డు నుండి 200 మీటర్ల దూరంలో బోటు ఉండగా, నీటి ఉపరితలం నుండి బోటు 50 మీటర్ల దూరంలో ఉన్నట్లుగా గుర్తించామని సత్యం పేర్కొన్నారు.
విశాఖపట్నం నుండి కొందరు డ్రైవర్లను నేడు రప్పించినట్లుగా చెప్పిన సత్యం కాస్త ఇబ్బందే అయినా అతి త్వరలోనే బోటును తీస్తామని ధీమా వ్యక్తం చేశాడు.బోటు ముగిని పోవడంతో 13 మంది ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
బోటు తేలిన తర్వాత ఏమైనా మృత దేహాలు బయటకు వచ్చే అవకాశం ఉందేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తమ వారి కడ చూపు కూడా దక్కని వారు చాలా మంది సత్యం వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
మరి ఆయన ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయో చూడాలి.