ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ కాల రాజకీయ విరోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇద్దరు ఒకరినొకరు అసెంబ్లీ ఏ స్థాయిలో విమర్శించుకున్నారో తెల్సిందే.
రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఇద్దరు ఒకే పార్టీకి చెంది ఉన్నారు.అలాగే ఇద్దరు కూడా స్నేహంగా ఉండేవారు.
కాని కాల క్రమేనా పరిస్థితి మారింది.రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి అంటూ చంద్రబాబుకు తీవ్రమైన కోపం ఉండేది.
కాని రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్తో కయ్యానికి చంద్రబాబు కాలు దువ్వుతున్నాడు.
జగన్ సీఎం అయ్యాక మీడియా వాచ్ అనే జీవోను తీసుకు వచ్చాడు.
ఆ జోవోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆ జీవోను తీసుకు వచ్చారు.
ఆసమయంలో మీడియా మరియు రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో మీడియాకు వ్యతిరేకంగా ఉన్న ఆ జీవోను రద్దు చేయడం జరిగింది.తనకు తెలియకుండా ఆ జీవో వచ్చిందని వైఎస్ఆర్ అప్పుడు జీవోను రద్దు చేశాడని, కాని ఇప్పుడు జగన్ మాత్రం ఆ జీవోను మరింత కఠినతరం చేస్తూ మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మీడియా విషయంలో జగన్ తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.