సార్వత్రిక ఎన్నికలల్లో అఖండ విజయం సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధం అవుతున్నారు.ఇక ఏపీ ఎన్నికలలో జగన్ అఖండ విజయంపై టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఇప్పటికే అభినందనలు తెలియజేసారు.
ఇక ఇక వైసీపీ పార్టీ నుంచి ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ప్రముఖులు కూడా కొంత మంది గెలిచారు.వారిలలో ముఖ్యంగా పూరీ జగన్నాథ్ తమ్ముడు పోటీ చేసి గెలిచాడు.
ఈ నేపధ్యంలో తాజాగా పూరీ జగన్నాథ్ ఆసక్తిక వాఖ్యలు చేసారు.పూరి జగన్నాధ్ తాజాగా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ ఎన్నికల్లో ఆయన గెలుపు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
ఫలితాల రోజు వైకాపా గెలుపు తర్వాత జగన్ మీడియాతో మాట్లాడటం టీవీలో చూశాను.జగన్ మొహంలో విజయ గర్వం ఏమాత్రం కనిపించలేదు.
ఎన్నికలలో ఘన విజయం సాధించాను అనే ఇగో ఆయనలో ఎక్కడా కనిపించలేదు.ఆ క్షణం ఆయన కళ్లలో కన్నీళ్లు కనిపించాయి.
ఆయనకు గతంలో తగిలిన వెన్ను పోటు కనిపించాయి.ఆయన పోరాటం స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శం.
ఆయన ఒక యోధుడు ఎంతో ఓపికక పదేళ్లుగా కష్టపడి విజయం సాధించారు అంటూ పూరీ చెప్పుకొచ్చాడు.మొత్తానికి పూరీ జగన్నాథ్ తమ్ముడు గెలుపు అతనిని ఆనందంలో ముంచేస్తుంది అని చెప్పాలి.
ఈ కారణంగానే పూరీ జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.