ఏపీ ఎన్నికలలలో ఘన విజయం తర్వాత వైసీపీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై ఇప్పటికే ద్రుష్టి పెట్టాడు.ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంకి సిద్ధం అయిన జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని తన ప్రమాణ స్వీకారంకి ఆహ్వానించారు.
ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కూడా కలిసి ఆహ్వానించారు.ఇదిలా ఉంటే ఇక తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు తీసుకున్న తర్వాత తాను చేయబోయే పనులు గురించి పంచుకున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయామలలో ఏకంగా రెండు లక్షల 50 కోట్లు రాష్ట్రం అప్పులు చేసారని అన్నారు.ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బాగోతాలపై విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అంశం మీద కూడా ప్రధాని మోడీతో చర్చించడం జరిగిందని, దానిని సాధించడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు.ఎన్నికల హామీలో భాగంగా 2024 నాటికి రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తాను కచ్చితంగా దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఈ పని పూర్తి చేసిన తర్వాతే తాను 2024 ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతానని జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసారు.
అలాగే వ్యవస్థలని సమూలంగా ప్రక్షాళన చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు.