ఏపీలో ఎన్నికలకి మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది కాని ఇప్పటికే రాజకీయం వేడెక్కి పోయింది.మరొక ఐదు నెలల్లో భవిష్యత్తు తెలిపోనుండటంతో ఎవరికి వారు వ్యూహ రచనల్లో బిజే బిజీ అయిపోయారు.
ఈ నేపధ్యంలోనే రాజకీయాలు రసవత్తరంగా మారాయి.గత ఎన్నికల్లో మోడీ , బాబు రాసుకు పూసుకుని ప్రచారం చేసుకోగా ఈ ఎన్నికల్లో మాత్రం బద్ధ శత్రువులు మాదిరిగా తయారయ్యారు.
మోడీ ఓటమే తమ ప్రదాన లక్ష్యంగా బాబు వ్యాఖ్యలు చేయడం అందుకు వ్యూహాలు సిద్దం చేయడంతో పరిస్థితులు మారిపోయాయి.అంతేకాదు

ఈ నెల 6 న గుంటూరులో మోడీ భారీ బహిరంగ సభ జరుగకుండా నిరసన తెలిపుతాను అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.అయితే మోడీ సభకి కొన్ని కారణాల వలన బ్రేక్ పడింది.ఇదిలాఉంటే నిన్నటి రోజున ఒక న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోడీ బాబు ని టార్గెట్ గా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తన సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ ప్రజలు బాబు కి గట్టిగా బుద్ధి చెప్పారని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్డీయే ని ఓడించేందుకు కలిసిన బాబు ,రాహుల్ కి మొదట్లోనే కోలుకోలేని షాక్ తగిలిందని విమర్శలు చేశారు.
దాంతో ఇక మోడీ టార్గెట్ లో బాబు ఫిక్స్ అయ్యిపోయారని అంటున్నారు పరిశీలకులు.ఇదిలాఉంటే తాజాగా విజయనగరం , వైజాగ్ , మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
పార్టీ బలోపేతానికి చేయవలసిన వ్యుహాలని వారికి వివరించారు మోడీ అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్ చెబితేనే తాము చేపట్టామని చంద్రబాబు చేసిన ప్రకటనను మోదీ ఖండించారు.బాబు మా ప్రాజెక్ట్ ని మేము నిర్మించుకున్తామని చెప్పడంతోనే ఆ భాద్యతలు ఎపీకి అప్పగించామని ఆయన తెలిపారు.

కేంద్రం నుంచీ ఎపీకి నిధులు వస్తుంటే బాబు మాత్రం అదేమీ లేదని బుకాయిస్తున్నారని, ప్రజలకి వాస్తవాలు తెలుపడం లేదని ఆయన మండిపడ్డారు.రిసోర్స్ గ్యాప్ – ఆర్థిక లోటు భర్తీకి సంబంధించి కేంద్రం నుంచీ ఎపీకి ఇప్పటి వరకోఒ రూ .20 వేల కోట్లను విడుదల చేశామని మరి ఆ నిధులు అన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని సూటిగానే ప్రశ్నించారు.అయితే ఈ విషయాలు నేను చెప్పేవి కావు కాగ్ చెప్తోంది అంటూ మోడీ ఘాటుగా విమర్శలు చేశారు.
అంతేకాదు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తున్న నిధుల విషయంలో కూడా బాబు ని ప్రశ్నించారు.ఈ విభాగంలో ఏపీకి ఇప్పటిదాకా రూ.1000 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.అయితే ఆ నిధులకు సంబంధించి చంద్రబాబు సర్కారు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని మోదీ ఆరోపించారు.
అయితే ఇప్పటి వరకూ మోడీ ఆరోపణలపై వివరణలు తెలుగు దేశం పార్టీ ఇవ్వలేక పోవడం ఎలాంటి అనుమానాలకి తావిస్తుందో ప్రజలకే తెలియాలి అంటున్నారు రాజకీయ పండితులు.