మళ్ళీ ఆపరేష్ గరుడ -2 అంటూ టాలీవుడ్ మాజీ హీరో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.ఆయన ఎన్నో సంచలన విషయాలని వెల్లడించారు అయితే ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏమిటా వార్త అంటే.చంద్రబాబు నాయుడు అనధికారికంగా సినిమాలు లేక ఖాళీగా పడిఉన్న శివాజీకి అనధికార తెలుగు దేశం ప్రతినిధిగా పదవి ఇచ్చాడని.
అందుకు భారీగా ముట్ట చెప్తున్నారని ఆ వార్తల కధనం.అన్తెకాదూ ఈ విషయంలో తెలుగు తమ్ముళ్ళు కూడా షాక్ అవుతున్నారట.
అసలు కందకి లేని దురద కత్తి పీటకి ఎందుకు అంటూ తెలుగు తమ్ముళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారు అంటే అనేక రకాల వార్తలు వస్తున్నాయి.ఆ వార్తల పై ఓ లుక్కేస్తే.

మాజీ హీరో శివాజీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు కుట్ర జరుగుతుందంటూ, కొదంరు ప్రభుత్వ అధికారులో అందుకు కారణం అవుతున్నారని , వారు తమ పద్దతిని మారుచుకోవాలని వార్నింగ్ లు ఇస్తున్నారు శివాజీ అంతేనా ఒకడుగు ముందుకు వేసి వారి తీరు మారక పొతే ఆమరణ నిరాహారా దీక్ష చేస్తా అంటూ ఏవో పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు.అసలు శివాజీకి చంద్రబాబు పై అధికారులు చేస్తున్న కుట్రలకి ఏమిటి సంభంధం.?? అసలు శివాజీ టీడీపీ మెంబెర్ కూడా కాదు.
మరి ఎందుకు ఇంతగా బాబు కోసం పడరాని పాట్లు పడుతున్నాడు, అంటే గుంటూరు జిల్లా నుంచీ టిక్కెట్టు కోసమని కొందరు.లేదు లేదు బాబు శివాజీ కి బాగా ముట్ట చెప్పాడని మరి కొందరు.
అదీ కాదు శివాజీ కి పాల్ లాగా చిన్న మెదడు చితికిందని, అందుకే పాల్ తరహ వ్యాఖ్యలు చేస్తున్నాడని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కాని ఈ విషయంలో మాత్రం తెలుగు తమ్ముళ్ళు శివాజీ , చంద్రబాబులపై గుర్రుగా ఉన్నారు.

ఎందుకంటే చంద్రబాబు విషయంలో తగుదునమ్మా అంటూ శివాజీ ఎంటర్ అవ్వడం వారికి అస్సలు రుచించడం లేదట.మాకంటే పార్టీ కోసం శివాజీ ఏమి కష్టపడాడు.చంద్రబాబు ఏమి ఇవ్వకుండానే అన్ని పనులు మానుకుని మరీ శివాజీ మీసం తిప్పుకుంటూ తాపీగా టీడీపీ కి మద్దతు ఇస్తాడా.?? అంటూ లోలోపల మదన పడుతున్నారట.మా చంద్రబాబు మా ప్రభుత్వం పై అధికారులు కుట్రలు చేస్తుంటే శివాజీ ఎందుకు నిరాహార దీక్ష చేయాలి అంటూ జుట్లు పీక్కునే పరిస్థితికి చేరుకుంటున్నారట.
అయితే ఇదే తరహా పరిస్థితి కేవలం కార్యకర్తాలో మాత్రమే కాదు.
కీలక నేతల్లో సైతం ఉండటంతో ఇప్పుడు చంద్రబాబు, శివాజీ ల విడదీయలేని భంధం వెనుక ఏముందని పరిశోధనలు చేస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు.మరి శివాజీ ప్రవర్తన ,ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అలానే ఉందని.
సినిమాలలో సైతం ఈ యాక్టింగ్ తట్టుకోలేక చాన్సులు పోయాయని.ఇప్పుడు ఇదే తరహా యాక్టింగ్ చేస్తే రాజకీయాలకి దూరం అయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు శివాజీకి సలహాలు ఇస్తున్నారు.
మరి శివాజీ మరో పాల్ కాకుండా ముందుగా మేల్కొంటే బాగుంటుంది అంటున్నారు.







