అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సారి తన ప్రతిభని ట్విట్టర్ సాక్షిగా బయట పెట్టారు.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్వేతసౌధంలోని చారిత్రక రూజ్‌వెల్ట్ గదిలో బుధవారం దీపావళి సంబరాలు నిర్వహించారు.
ఈ వేడుకలకు అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు భారతీయ- అమెరికన్లు.ఎంతో మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది.
దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ మేము అందరం ఒక్క చోటుకి చేరుకున్నాము.అమెరికాతో పాటు ప్రపచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది బౌద్ధులు, సిక్కులు, జైనులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇందులో హిందువులను ట్రంప్ ప్రస్తావించలేదు.
దీంతో నెటిజన్లు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.
Today, we gathered for Diwali, a holiday observed by Buddhists, Sikhs, and Jains throughout the United States & around the world.Hundreds of millions of people have gathered with family & friends to light the Diya and to mark the beginning of a New Year.
— Donald J.Trump (@realDonaldTrump)
దీపావళిని హిందువులు కూడా చేసుకుంటారు అంటూ ట్విట్టర్ లో ట్రంప్ కి దిమ్మతిరిగిపోయెలా షాక్ ఇచ్చారు.దాంతో ఆ ధాటికి తట్టుకోలేక మరో సార ట్రంప్ ట్వీట్ చేశాడు మళ్ళీ హిందువులని మరిచి ట్వీట్ చేయడంతో ఈ సారి హిందువులు మరింత తీవ్రంగా కామెంట్స్ చేశారు దాంతో మూడోసారి.
నేను దీపావళి ఉత్సవాలకు అతిథిగా రావడం నేను గర్వకారణంగా భావిస్తున్నాను.దీపావళి వేడుకను నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నాను.
వీరంతా ప్రత్యేకమైన వ్యక్తులు అని ట్వీట్ చేశారు.
It was my great honor to host a celebration of Diwali, the Hindu Festival of Lights, in the Roosevelt Room at the this afternoon.Very, very special people!
— Donald J.Trump (@realDonaldTrump)
తాను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత 24 మంది భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించానని, వారు ఎంతో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని ట్రంప్ తెలిపారు.ఈ వేడుకల్లో అమెరికాలో భారత రాయబారి నవజ్యోత్‌సింగ్ సర్నా, ఆయన భార్య డాక్టర్ అవినా సర్నా పలువురు పాల్గొన్నారు.