అంతకు మించి... మహాకూటమికి ధీటుగా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ..?

సంచలన నిర్ణయాలు తీసుకున్నా… తిట్ల పురాణం అందుకున్నా ఏది చేసినా కేసీఆర్ కి ఒక లెక్క ఉంటుంది.అది తిక్క అని ఎవరన్నా అన్నా ఆయన పట్టించుకోడు.

 Trs Manifesto 2018 Will Gives Wine To The Trs-TeluguStop.com

కావాల్సిందల్లా ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండాకు తిరుగే ఉండకూడదు.తెలంగాణలో గులాబీ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతుండాలి.

ఇదే ఆయనకు కావాల్సింది అందుకే విపక్షాలకు ధీటుగా ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నాడు కేసీఆర్.తమ ప్రత్యర్థి పార్టీలు గతంకంటే ఇప్పుడు పుంజుకున్నట్టుగా కనిపిస్తుండడంతో వారికి ధీటుగా హామీలు గుప్పించేందుకు సిద్దమయ్యాడు.

పాత పథకాలను కొనసాగిస్తూ.కొత్త వరాలను కుమ్మరించేందుకు రెడీ అవుతోంది టీఆర్ఎస్‌ మేనిఫెస్టో కమిటీ.15 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీ కాంగ్రెస్‌కు ధీటుగా మ్యానిఫెస్టోను వండి వారుస్తోంది.ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.

పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు చైర్మన్ గా 15 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు.కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్‌ భవన్‌లో భేటీ అయిన కమిటీ వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించే పనిలో పడింది.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇస్తున్న హామీలను కూడా.ఈ సమావేశంలో చర్చించారు.దీంతో కేసీఆర్‌ సూచన మేరకు ప్రజాకర్షక మ్యానిఫెస్టో రూపొందించే దిశగా కసరత్తు చేస్తున్నారు.రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులతో పాటు వివిధ వర్గాలను ఆకర్షించే విధంగా 20 కి పైగా అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

ప్రధానంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్ల పెంపు, నిరుద్యోగులకు ఉచిత శిక్షణా కేంద్రాలు, హైదరాబాద్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాల్లో సదుపాయాల కల్పన, అగ్రవర్ణ పేదలకు కూడా ప్రభుత్వ పథకాల్లో లబ్ది చేకూర్చే విధంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube