భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి అందరికీ తెలిసిందే.ఆయన ప్రతిభ ఎలాంటిదో, ఆయన ఎంతటి గొప్పవారో కూడా యావత్ దేశ ప్రజలకు తెలుసు.
పేద కుటుంబం నుంచి వచ్చి మిస్సైల్స్ తయారీలో పేరుగాంచి తరువాత దేశానికి రాష్ట్రపతి అయ్యారు ఆయన.తన పదవీ కాలంలోనే కాదు, అసలు జీవితంలోనూ ఎన్నడూ వివాదరహితుడిగానే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆయన జీవితంలో జరిగన ఓ ముఖ్యమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకసారి ఒక జర్నలిస్టు అబ్దుల్ కలాంను ఒక ప్రశ్న అడిగాడు.అందుకు కలాం ఏమని సమాధానం చెప్పారో వారి మాటల్లోనే విందాం.
జర్నలిస్టు: మీరు దేశానికి ఎన్నో సేవలు అందించారు కదా.వాటన్నింటిలోనూ మీకు చాలా సంతోషం అనిపించేలా చేసిన సంఘటన ఏమిటి?
అందుకు కలాం ఇలా సమాధానం చెప్పారు.
కలాం: నేను అగ్ని మిస్సైల్ తయారీ పనిలో నిమగ్నమై ఉన్నా.అప్పుడు నా వద్దకు ఓ డాక్టర్ వచ్చారు.ఆయన మిస్సైల్ తయారీలో ఉపయోగిస్తున్న పదార్థాలను చూశారు.
అవి చాలా తక్కువ బరువు కలిగి ఉండడమే కాదు, చాలా దృఢంగా కూడా ఉన్నాయి.దీంతో ఆయన నన్ను ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
అక్కడ 40 మంది చిన్నారులను నాకు చూపించారు.అందరికీ కాళ్లు లేవు.
అందరూ 4 కిలోల బరువున్న కాలిపర్లను పెట్టుకుని అతి కష్టం మీద నడుస్తున్నారు.కొన్ని సందర్భాల్లో వారికి నడవడానికి ఆ కాలిపర్లు భారంగా అనిపిస్తున్నాయి.
దీంతో ఆ డాక్టర్ నాతో అన్నారు.వారందరికీ మీ మిస్సైల్ తయారీలో వాడే పదార్థాలతో తక్కువ బరువు ఉండి, దృఢంగా ఉండే కాలిపర్లను తయారు చేసి ఇవ్వగలరా ? అన్నారు.నేను సరే అని చెప్పి మిస్సైల్ తయారీలో వాడే పదార్థాలతో కాలిపర్లను తయారు చేసి ఇచ్చా.అవి కేవలం 400 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో వాటిని ధరించిన చిన్నారులు నడవడం కాదు, పరిగెత్త సాగారు.
అది చూసిన వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి.ఆ సంఘటనే నాకు ఇప్పటికీ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.అని కలాం చెప్పారు.!
.