మెగా ఫ్యామిలీ నుండి సినిమాలు కనీసం వారం గ్యాప్‌లో రావాలన్నది నియమం.వారం గ్యాప్ లేకుండా మెగా హీరోల చిత్రాలను విడుదల చేయవద్దని గతంలోనే నిర్ణయించుకున్నారు.
అయితే ఈ సంక్రాంతికి మాత్రం పోటీ తప్పేలా లేదు.ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది.ఇక ఇదే సంక్రాంతికి వరుణ్ తేజ్ మూవీని విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్, వెంకటేష్‌తో కలిసి అనీల్‌రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.సంక్రాంతికి ఈ చిత్రానిన విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత దిల్‌రాజు తాజాగా ప్రకటించాడు.
గతంలో దిల్‌రాజు నిర్మించిన మహేష్, వెంకీల మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఈ చిత్రానికి కూడా సంక్రాంతి సందర్బంగా జనవరి 12 లేదా 13న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మద్య ఎప్పుడు పోటీ నెలకొనలేదు.ఇద్దరి మద్య పోటీకి ఖచ్చితంగా చరణ్‌ది పై చేయి అవ్వడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.కాని ఈ చిత్రం మల్టీస్టారర్ అవ్వడంతో అంచనాలు కాస్త భారీగానే ఉన్నాయి.దానికి తోడు దిల్‌రాజుకు మల్టీస్టారర్ చిత్రాల విషయంలో మంచి సెంటిమెంట్ ఉంది.అందుకే ‘ఎఫ్ 2’ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల కలెక్షన్స్ విషయంలో చాలా ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ ఇద్దరు సర్దుబాటు చేసుకుంటారా లేదంటే సంక్రాంతికి ఇద్దరు పోటీ పడతారా అనేది చూడాలి.వీరిద్దరితో పాటు బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రం కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరి సంక్రాంతి పోరులో నెగ్గేది ఎవరో చూడాలి.