మన శరీరానికి అవసరమైన పోషకాలలో క్యాల్షియం చాలా కీలకం అని మనకు తెలిసిన విషయమే.క్యాల్షియం ఎముకలకు బలాన్ని ఇచ్చి దృడంగా చేస్తుందని అందరూ భావిస్తారు.
కానీ క్యాల్షియం మన శరీరంలో ఎన్నో పనులను నిర్వర్తిస్తుంది.చాలా మందికి తెలియదు.
ఇప్పుడు క్యాల్షియం మన శరీరంలో ఎన్ని రకాల పనులను చేస్తుందో తెలుసుకుందాం.ప్రతి రోజు పాలు, గుడ్లు, పాలకూర, జీడిపప్పు, మునగాకు వంటి క్యాల్షియం సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన క్యాల్షియం అందుతుంది.
అంతేకాక ఒకవేళ క్యాల్షియం లోపం ఉంటే కనుక తొలగిపోతుంది.క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన అధిక బరువు ఉన్నవారు తగ్గుతారు.
అలాగే క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
అలాగే వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పుల సమస్య కూడా తగ్గుతుంది.
స్త్రీలకు రుతు సమయంలో వచ్చే వెన్ను నొప్పి, చిరాకు, కోపం, ఆందోళన తగ్గాలంటే ఆ సమయంలో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.క్యాల్షియం మోతాదు మించితే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
కాబట్టి క్యాల్షియంను మోతాదుకు మించి తీసుకోకూడదు.రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో క్యాల్షియం కీలకమైన పాత్రను పోషిస్తుంది.
ఇటీవల జరిగిన పరిశోధనలో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని తెలిసింది.కాబట్టి క్యాల్షియం సమృద్ధిగా ఉన్నఆహారాలను తీసుకోని ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.