మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండవ భర్త అయిన కళ్యాణ్ చూడ్డానికి చక్కగా, హీరోలా ఉంటాడు.
అందుకే ఆయన హీరో అయిపోవాలని కలలు కన్నాడు.మెగాస్టార్ అు్లడు కల కనడం, అది నెరవేరకుండా ఉండటమా, అనుకున్నట్లుగానే ఆయన సినిమా హీరో అయ్యాడు.
అది కూడా లాంచనంగా, పెద్ద సినిమాతో కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.అంతా కూడా కళ్యాణ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
కళ్యాణ్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.డబ్బింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయి.ఇక తాజాగా ఈ చిత్రానికి ‘విజేత’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ లోగోను విడుదల చేశారు.
చిరంజీవి సూపర్ హిట్ చిత్రం అయిన విజేత టైటిల్‌ను కళ్యాణ్ మొదటి సినిమాకు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.ఇది పెద్ద సాహసం అని, ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది
మెగాస్టార్ సినిమా పాటను రీమిక్స్ చేయాలి అంటేనే ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలు కాస్త భయపడతారు.
ఆ స్థాయిలో తాము చేయగలమా, ఆ పాట స్థాయిని తగ్గించిన వాళ్లం అవుతామా అంటూ భయపడుతూ భయపడుతూ రీమిక్స్‌లు చేస్తూ ఉంటారు.ఇక సినిమా టైటిల్‌ను మోయడం అంటే మామూలు విషయం కాదు.
చిరంజీవి సినిమా టైటిల్‌తో మెగా హీరో మూవీ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి.ఆ అంచనాలను ఏమాత్రం తగ్గినా కూడా సినిమాను కింద ఎత్తి వేయడం ఖాయం.
అందుకే టైటిల్ విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
కళ్యాణ్ మొదటి సినిమాకే ఇంత భారమైన టైటిల్‌ను నెత్తికి ఎత్తడం ఎంత వరకు సమంజసం అని, ఆయనకు అంతగా ఆ టైటిల్‌ను వాడాలనుకుంటే రెండూ ముడు సినిమాల తర్వాత అయినా వాడి ఉండాల్సిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కళ్యాణ్ మొదటి సినిమా సాదా సీదాగా ఉంటే ఇప్పుడు ప్రేక్షకులు ఒప్పుకోరు.
ఎందుకంటే ఈ చిత్రానికి ‘విజేత’ అనే టైటిల్‌ను పెట్టారు కనుక.చిరంజీవిని ఒప్పించి నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రానికి ఆ టైటిల్‌ను ఖరారు చేశారు.
చిరంజీవి అయినా టైటిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బాగుండేది.త్వరలో విడుదల కాబోతున్న ‘విజేత’తో కళ్యాణ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.