టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ దర్శకులు ఎవరు అంటే ఠక్కున వినిపించే మూడు పేర్లు రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్.ఈ ముగ్గురు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు.
ఈ ముగ్గురి దర్శకత్వంలో నటించేందుకు స్టార్స్, సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.భారీ అంచనాల నడుమ ఈ ముగ్గురి సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి.ఈ ముగ్గురు చేస్తున్న సినిమాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తారు
ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా సినిమా చేయకుండా, తమ తర్వాత సినిమా ఏర్పాట్లలో ఉన్నారు.ఈ ముగ్గురు త్వరలోనే వారి వారి సినిమాలను మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు.ఇక ఈ ముగ్గురు పారితోషికం విషయంలో ఒకే విధంగా వ్యవహరిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.మొదట ‘బాహుబలి’ సినిమాకు రాజమౌళి పారితోషికం మాట్లాడుకున్నాడు.అయితే ఆ సినిమా స్థాయి పెరగడంతో పారితోషికంతో పాటు నిర్మాతలు లాభాల్లో వాటాను కూడా ఇచ్చారు.బాహుబలి వల్ల జక్కన్నకు దాదాపుగా 60 కోట్లకు పైగానే ముట్టినట్లుగా తెలుస్తోంది
బాహుబలి తెచ్చిన క్రేజ్‌తో జక్కన్న తర్వాత సినిమాకు నిర్మాత దానయ్య ఎంత పారితోషికం అయినా ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.
అయితే జక్కన్న మాత్రం 30 కోట్ల పారితోషికం మరియు లాభాల్లో వాటాను డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.అందుకు ఓకే చెప్పిన నిర్మాత దానయ్య అడ్వాన్స్‌గా అప్పుడే సగం మొత్తంలో పారితోషికం చెల్లించాడు.
ఇక రాజమౌళి తర్వాత కొరటాల శివ లాభాల్లో వాటాను దక్కించుకుంటున్నాడు.భరత్ అనే నేను చిత్రం నుండి కొరటాల శివ లాభాల్లో వాటాను తీసుకుంటున్నాడు.
భరత్ ద్వారా కొరటాలకు ఏకంగా 35 కోట్ల మేరకు ముట్టినట్లుగా తెలుస్తోంది
రాజమౌళి, కొరటాల దారిలోనే సుకుమార్ ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.‘రంగస్థలం’ చిత్రం కోసం 15 కోట్ల పారితోషికం తీసుకున్న సుకుమార్ త్వరలో మహేష్‌బాబుతో చేయబోతున్న సినిమాకు 18 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను తీసుకోబోతున్నాడు.
అందుకు అనుగుణంగా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.సినిమా సక్సెస్ అయితే మరో 10 కోట్లు సుకుమార్ ఖాతాలో పడే అవకాశం ఉంది.
అంటే 28 నుండి 30 కోట్ల మేరకు సుకుమార్‌కు దక్కే అవకాశాలున్నాయి.మొత్తానికి దర్శకులు ఇలా పారితోషికంను వాటాలుగా తీసుకుంటూ నిర్మాతలకు కాస్త ఇబ్బందులు పెడుతున్నారు.
కాని టాప్ దర్శకులు అవ్వడంతో వారు ఏమనలేక పోతున్నారు.వీరితో పాటు త్రివిక్రమ్ కూడా లాభాల్లో వాటాను తీసుకుంటాడు.
అయితే త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అవ్వడంతో ఆయన గురించి అంచనాలు లేవు.