తెలుగు సినీ అభిమానులు గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న ‘మహానటి’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న మరియు ప్రియాదత్‌లు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే ప్రశంసలు దక్కించుకుంది.
సినిమాలోని పాత్రల కోసం ఎంపిక చేసిన నటీనటుల విషయంలో చిత్ర దర్శకుడు అభినందనలు అందుకున్నాడు.ఏ పాత్రకు ఎలాంటి దర్శకుడు అయితే బాగుంటాడు, ఎలాంటి నటి అయితే ఆ పాత్రను సంతృప్తి పర్చుతుందో అలాంటి వారిని ఎంపిక చేయడంతో దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెల్సిందే.నిజంగా సావిత్రి గారేనేమో అన్నట్లుగా కీర్తి సురేష్ మేకప్, బాడీలాంగ్వేజ్ మరియు హావభావాలు ఉన్నాయి.దాంతో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేయడం అత్యుత్తమ మంచి నిర్ణయం అన్నారు.ఇక సావిత్రి భర్త జెమిని గణేష్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు.
తెలుగు ప్రేక్షకులకు జెమిని గణేష్ గురించి పెద్దగా తెలియదు, ఆయన ఫేస్ కూడా అంతగా అవగాహణ లేదు.కాని దుల్కర్‌ను జెమిని గెటప్‌లో చూసిన ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటున్నారు.
నిజంగా జెమిని ఇలాగే ఉండేవాడా అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.జెమిని గణేష్‌ను ఎరిగిన వారు ద్కుర్ ఆయన్ను దించేశాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమాకు చాలా కీలకం అయిన ఈ రెండు పాత్రలను మొదట మరో నటీనటుడుతో చేయాలని దర్శకుడు భావించాడు.సావిత్రి పాత్ర కోసం ఎంతో మందిని పరిశీలించిన దర్శకుడు నాగ్ అశ్విన్ చివరకు సమంతను ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యాడు.
కొన్ని మేకప్ టెస్టులు చేయడంతో పాటు, ఆడిషన్ నిర్వహించాడు.సమంతను దాదాపుగా ఫైనల్ అనుకున్నారు.
ఆ సమయంలోనే ఒక తమిళ సినిమాలో కీర్తి సురేష్‌ను చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమె అయితే సావిత్రి పాత్రకు పర్‌ఫెక్ట్ అనుకున్నాడు.ఆమె మొదట భయపడ్డా ఆ తర్వాత నాగ్ అశ్విన్ ఇచ్చిన ధైర్యంతో సావిత్రిగా దుమ్ము రేపింది.
ఇక జెమిని గణేషన్ పాత్రకు మొదట దుల్కర్‌ను అనుకున్నారు, కాని ఆయన డేట్లు కుదరలేదు.దాంతో జెమిని పాత్రలో నటించాలి అంటూ విజయ్ దేవరకొండుకు దర్శకుడు ఫోన్ చేయడంతో షాక్ అయిన విజయ్ దేవరకొండ మూడు రోజుల తర్వాత ఓకే అన్నాడు.
అంతా రెడీ అనుకుంటున్న సమయంలో దుల్కర్ మళ్లీ నటిస్తాను అంటూ కమిట్‌మెంట్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండకు విజయ్ ఆంటోని పాత్రను ఇవ్వడం జరిగింది.మొత్తానికి రెండు ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్‌లు జస్ట్ మిస్ అయ్యారు.
వారిద్దరు మిస్ అయినా కూడా ఆ పాత్రలకు మంచి వారు లభించారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.