‘మహానటి’లో ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఉండదట!

తెలుగు సినిమా తొలి తరం స్టార్‌ హీరోయిన్‌ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

 Mahanati Movie 3 Questions-TeluguStop.com

దాదాపు మూడు సంవత్సరాల పాటు సావిత్రి జీవితం గురించి రీసెర్చ్‌ చేసి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం గురించి సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహానటిగా జేజేలు అందుకున్న సావిత్రి ఎందుకు అర్థాంతరంగా చనిపోయారు, ఆమె చనిపోయిన సమయంలో ఏం జరిగింది, చనిపోయే ముందు ఆమె పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు ఇప్పటికి కూడా అందరిని తొలిచి వేస్తున్నాయి.

సావిత్రి మరణించిన సమయంలో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదని, ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనై మద్యంకు బానిస అయ్యిందని, సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా మానసిక ఒత్తిడి కారణంగా కాదనుకుందని కొందరు అంటూ ఉంటారు.మహానటి సినిమాలో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.సావిత్రి భర్త అయిన జెమిని గణేష్‌ ఆమెను నిర్లక్ష్యం చేశాడని, ఆమె చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా పట్టించుకోకుండా వదిలేశాడు అంటూ కొందరు అంటూ ఉంటారు.

కాని ఆ విషయమై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

మహానటి జీవిత చరిత్ర మొత్తం కూడా సాఫీగా సాగిపోనుంది, గతంలో సమాధానాలు లేని ప్రశ్నలుగా ఉన్న వాటికి ఈ చిత్రం కూడా సమాధానాలు ఇవ్వడం లేదు.

అసలు ఆ ప్రశ్నలే లేవు అన్నట్లుగా సినిమా ఉండే అవకాశం ఉంది.సావిత్రి, జెమిని గణేష్‌లు మంచి అన్యోన్య దాంపత్యంను గడిపినట్లుగా సినిమాలో దర్శకుడు చూపించనున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌ మరియు టీజర్స్‌ను బట్టి అర్థం అవుతుంది.

సావిత్రి జీవితంలో ఎలాంటి ఒడుదుడుకులు ఎదుర్కోలేదని కూడా ఈ చిత్రం కథలో దర్శకుడు రాసుకున్నాడు.మొత్తానికి సావిత్రి జీవితం గురించి తెలుసుకోవానుకుంటున్న విషయాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించడం లేదని అనిపిస్తుంది.

సావిత్రి మరణం సమయంలో చాలా హీనమైన జీవితాన్ని అనుభవించిందని సినిమా పరిశ్రమకు చెందిన సీనియర్లందరికి తెలుసు.ఆ విషయాన్ని చాలా సమయాల్లో, చాలా సార్లు, చాలా మంది చెప్పుకొచ్చారు.

కాని దర్శకుడు అలాంటి వివాదాలకు పోకుండా కేవలం సావిత్రి జీవితంలోనే మధురమైన ఘట్టాలను మాత్రమే తెరకెక్కించాడు.నాణెంకు రెండు వైపులు ఉన్నట్లుగానే సావిత్రి జీవితంలో కూడా రెండు భాగాలు ఉన్నాయి.

అయితే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సావిత్రి జీవితం ఒక్క వైపు మాత్రమే చూపించబోతున్నాడు.ఇప్పటి వరకు సమాధానం లేకుండా ఉన్న ప్రశ్నలు సినిమా విడుదల తర్వాత కూడా అలాగే ఉండనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube