అల్లు అర్జున్ హీరోగా, అను ఎమాన్యూల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.భారీ అంచనాలున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు.
రచయితగా ఎన్నో సూపర్ హిట్స్‌ను అందుకున్న ఈయన మొదటి సారి దర్శకత్వం చేశాడు.మరి ఈ చిత్రం ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి అంటే విడుదల వరకు ఆగాలి.
ఇక ఈ చిత్రం విడుదల విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.పెద్ద సినిమాలకు ఇటీవల ఏపీలో ఉదయం ఆటలకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
కాని ఈ చిత్రానికి ఇస్తారా లేదా అనే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల మెగా ఫ్యామిలీ మొత్తం టీడీపీకి పూర్తి వ్యతిరేకం అయ్యింది.పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకులపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో అభ్యంతరక వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆ వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ అంతా కూడా మద్దతు పలికింది.
పవన్‌పై జరిగిన మీడియా దాడిని మెగా ఫ్యామిలీ ఖండివ్వడంతో వివాదం పెద్దదైంది.మెగా ఫ్యామిలీ అంతా కూడా ఏపీ ప్రభుత్వం అంటే తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకం అయినట్లే.
ఈ కారణంగానే ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని ఏపీలో బెన్‌ఫిట్ షో వేయడం కష్టం అయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.
ఇటీవల విడుదలైన ‘అజ్ఞాతవాసి’, ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వడం జరిగింది.
కాని నా పేరు సూర్య చిత్రానికి మాత్రం ఏపీ ప్రభుత్వం ఏదో ఒక వంక చెప్పి బెన్ ఫిట్ షోలకు, మిడ్ నైట్ షోలకు అనుమతి ఇవ్వక పోవచ్చు అంటూ సమాచారం అందుతుంది.ఏపీ ప్రభుత్వం మెగా ఫ్యామిలీ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది.
అందుకే ఈ చిత్రానికి అనుమతులు ఇవ్వక పోవచ్చు.
స్టార్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ సాధ్యం అవ్వాలి అంటే ఖచ్చితంగా బెన్ ఫిట్ షోు మరియు మిడ్ నైట్ షోలు పడాల్సిందే.
అలా పడితేనే రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు అవుతాయి.మరి నా పేరు సూర్య చిత్రానికి ఏపీ ప్రభుత్వం ఒక వేళ ప్రత్యేక షోలకు అనుమతించకుంటే ఖచ్చితంగా భారీ నష్టం తప్పదని డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షపాతం లేకుండా నా పేరు సూర్య చిత్రానికి కూడా ప్రత్యేక షోలకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.