బీజేపి మైండ్ గేమ్...వైసీపిలోకి “కావూరి, పురంధరేశ్వరి”..?

బీజేపి ఏపీలో తన పార్టీ పోయినా పరవాలేదు వైసీపి కి మాత్రం క్రేజ్ రావాలని అనుకుంటుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ఎనికలకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో బీజేపి తన వ్యుహాలకి పదును పెడుతోంది.

 Bjp Mind Game On Tdp Party-TeluguStop.com

ఎలా అయినా సరే ఏపీ సీఎం చంద్రబాబు ని గద్దె దించడమే ధ్యేయంగా పెట్టుకున్న బీజేపి ,వైసీపి కొత్త వ్యుహాలని అమలుచేస్తున్నాయి అంటున్నారు.అందులో భాగంగానే బీజేపి సీనియర్స్ గా చెప్పబడే బడా నేతలని వైసీపిలోకి వెళ్ళేలా వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమలోనే గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది.కొన్నాళ్ళుగా రచిస్తున్న వ్యుహాలకి పదును పెట్టనున్నారు నేతలు.అయితే సీనియర్స్ అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకోకుండా ఒక్కొక్కరిగా పార్టీలోకి పంపుతున్నారు.వారిలో ముఖ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఒకరు.ఇప్పటికే ఆయన చేరిక లాంచనం అయ్యింది ఆయన ఈ నెల25న వైకాపాలో చేరబోతున్నారు.అయితే ఆతరువాత లిస్టు లో కావూరి సాంబశివరావు ఉన్నారు.అయితే

ఈ ఇద్దరి చేరికల తరువాత కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి చేరిక ఉంటుందని ఆ తరువాత విష్ణుకుమార్‌రాజు చేరుతారని తెలిపారు అయితే ఈ చేరికలతో అప్పటికే వైసీపి కి ప్రజలలో క్రేజ్ పెరిగిపోతుంది.అంతేకాదు ఆ సమయంలో జరిగే హంగామా తో టీడీపీ పార్టీలో ఒక అలజడి వాతావరం కలిగేలా చేయడానికి పక్క ప్లాన్ రచిస్తోంది ఈ చేరికలు అన్నీ అయ్యిపోయి వైసీపి కి ప్రజలలో క్రేజ్ వచ్చిన తరువాత చంద్రబాబు,బాలయ్య ఫ్యామిలీ లు షాక్ అయ్యే విధంగా దగ్గుబాటి పురంధేశ్వరి.

వైసీపిలోకి వెళ్తుందని అంటున్నారు.

ఒకవేళ ఇదే గనుకా జరిగితే వైసీపి ఇమేజ్ భారీగా పెరగడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు అంతేకాదు నలుగురు బీజేపి ఎమ్మెల్యేలలో ఇద్దరు వైసీపిలోకి వస్తారాన్ని కూడా తెలుస్తోంది.

ఇలా చేయడం వలన టిడిపిని దెబ్బకొట్టి నట్టుగా ఉంటుననేది బీజేపి ఆలోచన అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఏపీ ప్రజలు బీజేపి పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ఆ పార్టీ నేతలు వైసీపిలోకి వెళ్తే తీవ్రంగా నష్టపోయేది మాత్రం జగన్ అనేది సత్యం మరి అంతటి సాహసం జగన్ చేస్తాడా బీజేపి వ్యూహం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అంటే ఆ సమయం వరకూ వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube