అందమైన కనురెప్పల కోసం బెస్ట్ టిప్స్

ప్రతి అమ్మాయి ఒత్తైన,అందమైన కనుబొమ్మలు ఉండాలని కోరుకోవటం సహజమే.అయితే కొంత మంది సన్నని కనుబొమ్మలు ఉండాలని థ్రెడ్డింగ్, ఓవర్ ప్లుక్కింగ్ (లేదా) వాక్సింగ్ వంటివి చేస్తూ ఉంటారు.

 అందమైన కనురెప్పల కోసం బెస్ట్ -TeluguStop.com

అయితే కొంత మందికి కనుబొమ్మలు బాగా సన్నగా ఉండి నలుగురిలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారు ఈ సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి కనుబొమ్మలు ఒత్తుగా, అందంగా మార్చుకోవచ్చు.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో విటమిన్ E,ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన కనుబొమ్మలు పెరగటానికి రక్త ప్రసరణను పెంచుతుంది.

అందువల్ల రోజుకి రెండు సార్లు కొబ్బరి నూనెను కనుబొమ్మలపై రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది.

ఉల్లి రసం
జుట్టు పెరుగుదలలో ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది.ఉల్లిపాయను ముక్కలుగా కోసి మిక్సీ చేసి ఉల్లిరసాన్ని తయారుచేయాలి.ఈ రసాన్ని ప్రతి రోజు కనుబొమ్మలపై రాసి పది నిమిషాల తర్వాత చాలాల్ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

గుడ్డు పచ్చ సోన
మన పూర్వీకుల కాలం నుండి జుట్టు పెరుగుదలకు గుడ్డు పచ్చసోనను వాడుతూ ఉన్నారు.గుడ్డు నుంచి పచ్చ సొనను వేరుచేసి కనుబొమ్మలపై రాసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మంచి ఫలితాల కోసం వారంలో మూడు సార్లు ఈ విధంగా చేయాలి.

మెంతులు
రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెంతులను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్ ని కనుబొమ్మల మీద రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ఒత్తైన,అందమైన కనుబొమ్మలు మీ సొంతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube